HomeAndhrapradesh-newsAp High Court Judge K Srinivas Reddy Expressed His Anger At Tdp Social Media Activists
టీడీపీ ట్రోల్స్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్టు జడ్జి కే శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారన్నారు.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్టు జడ్జి కే శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారన్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీ నెయ్యి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయితే సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తినైన తనను సైతం ట్రోలింగ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం ఏపీలో దుమారం రేపింది.
అసలేం జరిగిందంటే?
వైసీపీ కార్యకర్త సింగయ్యను ఉద్దేశపూర్వకంగా కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వాదనలను హైకోర్టు ఎండగట్టింది. ఈ కేసులో 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. జగన్ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.