తిరుమల : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ (Chief Justice ) ధీరజ్ సింగ్ ఠాకూర్ (Deeraj Singh Tagore) తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల (Tirumala ) శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. సోమవారం తెల్లవారుజామున జస్టిస్ తిరుమలలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు పూజలు అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్వీరచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు శాలువాతో సన్మానించారు.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 84,536 మంది భక్తులు దర్శించుకోగా 25,890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.67 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వెల్లడించారు.