అమరావతి : ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ (AP High Court CJ )గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్(Dheeraj Singh Thakur) పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆయన 2013లో జడ్జిగా నియామకమయ్యారు. సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయనను 2022లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమించారు. ఈ యేడాది ఫిబ్రవరి 9న మణిపూర్(Manipoor) హైకోర్టు సీజేగా నియమిస్తు పేరును ప్రతిపాదించగా కేంద్రం ఇంకా ఆమోదం తెలుపులేదు. ఈ దశలో ఆ సిఫార్సును రద్దు చేస్తూ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను ఏపీ సీజేగా సిఫారుసు చేస్తూ కేంద్రం ఆమోదానికి పంపింది. కేంద్రంఈ సిఫారుసుకు ఆమోదం తెలుపవలసి ఉంది .