BJP List | బీజేపీ తొలి జాబితాలో ఏపీకి నో ఛాన్స్ .. కారణమేమిటంటే ?
BJP List | దేశవ్యాప్తంగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఏపీకి స్థానం దక్కలేదు. మొదటి జాబితాలో సుమారు 195 మంది బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు.
అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఏపీకి స్థానం దక్కలేదు. మొదటి జాబితాలో సుమారు 195 మంది బీజేపీ అభ్యర్థుల (BJP Candidate List) పేర్లను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో టీడీపీ, జనసేన కూటమి(Alliance) పార్టీలు బీజేపీతో పొత్తును ఆశిస్తున్నాయి.
ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా, పొత్తులతో ముందుకు వెళ్లాలా అనే అంశంపై అధిష్టానం చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడంతోనే అభ్యర్థులను ఖరారు చేయక ఉండకపోవచ్చని ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 స్థానాలకు గాను వైసీపీ 22 స్థానాలు, టీడీపీ మూడు స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయాయి. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలను కైవసం చేసుకుంటామని దీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీ ఏపీలోనూ బోణి కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

