అమరావతి : సినిమా టికెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలపై కమిటీని నియమించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు, అలాగే రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, సమాచార కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు. ఈ కమిటీ టిక్కెట్ ధరలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది.