తిరుపతి : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి దర్శన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్కు జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
ఇవాళ ఉదయం ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారిని 76,425 మంది భక్తులు దర్శించుకోగా 36,053 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.15 ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం 27 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 8 గంటలో దర్శనం కానున్నదని వివరించారు.