అమరావతి : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహాత్మాగాంధీజీకి ఘన నివాళి అర్పించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్భవన్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో తనదైన శైలీలో జాతీని ఏకం చేసి రక్తపాతం లేకుండా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానేత గాంధీ అని కొనియాడారు.
గాంధీజీ విధానాలు దేశప్రజలు ఎంతగానో స్ఫూర్తినిస్తాయని, మహానుభావుల అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని సూచించారు. అమరవీరుల స్వాతంత్ర్య పోరాటాలు స్మరించుకోవడమే వారికి నిజమైన నివాళులని పేర్కొన్నారు.