విజయవాడ: ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు రావాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయం అధికారులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లకు దుర్గా ఆలయ అర్చకులు ఆశీస్సులు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే దసరా వేడుకలకు ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ ఏపీ గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. ఆలయ అర్చకులు, అధికారులతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన ఆమె.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఆహ్వానపత్రం అందించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 26 న ప్రారంభమై అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయని, దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు తొమ్మిది రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని గవర్నర్ దంపతులకు ఈఓ వివరించారు. ఐదో రోజు కృష్ణానదిలో తెప్పోత్సవంలో భాగంగా ఆలయ పీఠాధిపతులను ‘హంస వాహనం’పై తీసుకెళ్లనున్నారు. ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని ఈఓ గవర్నర్‌కు వివరించారు.