(Vijayawada Book Exhibition) విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో 32వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు, కార్యవర్గ సభ్యుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
చిన్నతనంలోనే పిల్లల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించేలా తల్లిదండ్రులు చూడాలని గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ సూచించారు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునన్నారు. పుస్తక పఠన అలవాటును ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించడంలో కృషి చేస్తున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఇతర భారతీయ భాషల్లోని ప్రముఖ రచయితల ఎంపిక చేసిన రచనలను తెలుగులో ప్రచురించాలని, తద్వారా తెలుగు పాఠకుడు దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రను తెలుసుకునే వీలు చిక్కుతుందని చెప్పారు.
బందరు రోడ్డులోని పీడబ్ల్యూడీ మైదానంలో నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శన ఈ నెల 11 వ తేదీ వరకు కొనసాగనున్నది. పుస్తక మహోత్సవంలో మొత్తం 210 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 4 వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి బందరు రోడ్ స్వరాజ్య మైదాన్ వరకు పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. కరోనా నిబంధనలను పాటించేవారినే బుక్ ఫెస్టివల్లోకి రానిస్తామని, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడాలని బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు.
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..