Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్, ఐఏఎస్‌లను ఉన్నతాధికారులను బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా భారీగా డీఎస్పీల బదిలీలను చేపట్టింది. శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 20 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన డీఎస్పీలు వీళ్లే..
☞ జి.సీతారామారావు
☞ వీవీ అప్పారావు
☞ ఎన్.కాళిదాస్
☞ చిట్టిబాబు
☞ బి.రామకృష్ణ
☞ సురేశ్‌కుమార్ రెడ్డి
☞ ఏబీజీ తిలక్
☞ రవికిరణ్
☞ మల్లిఖార్జునరావు
☞ శ్రీనివాసరెడ్డి
☞ ఎండీ మొయిన్
☞ కేసీహెచ్ రామారావు
☞ విజయశేఖర్
☞ కొంపల్లి వేంకటేశ్వరరావు
☞ కే. రసూల్ సాహెబ్
☞ సీహెచ్‌వీ రామారావు
☞ షణ్ను షేక్
☞ ఎన్.సురేశ్‌బాబు
☞ వాసుదేవన్
☞ డి.లక్ష్మణరావు
Dsp1
Dsp2
గత ప్రభుత్వంలో వైసీపీకి పోలీసు శాఖలో పలువురు అధికారులు అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఎప్పట్నుంచో ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులను బదిలీ చేశారు. అయినప్పటికీ ఇంకా కొందరు వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి కూటమి ప్రభుత్వం భారీ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.