అమరావతి : ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని వ్యవహారం హైకోర్టు తీర్పు రిజర్వులో ఉండగా ఏపీ ప్రభుత్వం రాజధాని భూములను తనఖా పెట్టడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా తాము ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. తాము ఇచ్చిన రాయితీల్లో కోత పెట్టారని తెలిపారు.
కరోనా పేరు చెప్పి ఏ రాష్ట్రం కూడా వేతనాల్లో కోతలు పెట్టలేదు, వైసీపీ ప్రభుత్వమే రివర్స్ పీఆర్సీ ఇచ్చి చరిత్ర సృష్టించిందని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, రాష్ట్రంలో కరెంటు కోతలు అరికట్టాలని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని, డిస్కంల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు మృతుల కుటంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.