శ్రీశైలం : దసరా ఉత్సవాల ( Dussehra celebrations ) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున
స్వామిఅమ్మవార్లకు (Mallikarjuna Swamy Ammavar) పట్టు వస్త్రాలు ( Silk Garments ) సమర్పించారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి( MLA Budda Rajashekar Reddy ) , దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్లాల్ , కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షెరాన్, ఆలయ చైర్మెన్ రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు ఆహ్వానం పలికారు.
మంగళవాయిద్యాలు, వేదమంత్రోఛ్చారణలతో పట్టు వస్త్రాలను తలపై ఉంచుకుని ఆలయ ప్రవేశం చేసిన మంత్రి దంపతులుప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ పూర్వం నుంచి రాజ కుటుంబీకులు, చక్రవర్తుల సాంప్రదాయంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించే ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.