AMRUT 2.0 | ఏపీ ప్రజలకు శుభవార్త. అమృత్ ( AMRUT ) 2.0 పథకం కింద రూ.10,319 కోట్ల విలువైన 281 పనులను చేసేందుకు పరిపాలన విభాగం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ పనుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతను APUFIDC, పబ్లిక్ హెల్త్, గ్రీన్ బిల్డింగ్స్ కార్పొరేషన్లకు అప్పగిస్తున్నారు. ఇక ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చులో కేంద్రం రూ.2,470 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,490 కోట్లను విడుదల చేయనున్నాయి. ఫైనాన్షియల్ కమిషన్ నిధులు రూ.925 కోట్లు, పట్టణాల వాటా రూ.590 కోట్లు విడుదల చేయనున్నాయి. అంతా కలిపి ప్రాజెక్టు క్యాపెక్స్ రూ.6477 కోట్లవ్వగా.. దీనికి పదేళ్ల నిర్వహణ ఖర్చు రూ.1499 కోట్లు, వడ్డీ ఖర్చు కింద రూ.2,344 కోట్లుగా నిర్దారించింది.