Ex Minister Satyanarayana | మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత..
Ex Minister Satyanarayana | మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు.
Ex Minister Satyanarayana | మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా 1983 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో ఆయన ఒకరు.
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున నాలుగుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేబినెట్లో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీలో అంచనాల కమిటీ చైర్మన్గా వివిధ హోదాల్లో పని చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

