Perni Nani | మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని చేసిన విమర్శలకు నిరసనగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మచిలీపట్నంలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తక్షణమే పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జనసేన కార్యకర్తలు ముట్టడికి వచ్చారని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా పేర్ని నాని నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు. వైసీపీ నాయకులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
జన సైనికుల ఆందోళనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్టు ఒక సిద్దాంతం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కులం లేదు, మతం లేదంటూనే హిందువులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ బాధ్యతలు మరిచి ప్రవర్తించడం సిగ్గుమాలిన పని కాదా అంటూ ప్రశ్నించారు.
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో….
మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం
గుర్తు పెట్టుకో @PawanKalyan
–@perni_nani 🔥🔥🔥 pic.twitter.com/42ssV2tRdL
— MBYSJTrends ™ (@MBYSJTrends) September 26, 2024