YS Jagan | ప్రేమోన్మాది చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన సహాన కుటుంబసభ్యులకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లిన జగన్.. ముందుగా మార్చురీలో సహాన మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సహాన కుటుంబ కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని అన్నారు. ఓ దళిత చెల్లి బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీన్తో పాటు మరికొందరు ఆమెను తీసుకెళ్లారని పేర్కొన్నారు. సహాన శరీరంపై గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు భరోసా ఇచ్చామని తెలిపారు. దిశ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో చూశామని అన్నారు. ప్రభుత్వంనుంచి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తోడుగా ఉండలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని జగన్ అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. నిందితుడు నవీన్ టీడీపీకి చెందిన వాడు అని అన్నారు. చంద్రబాబుతోనూ నిందితుడు ఫొటోలు దిగారని చెప్పారు. అందుకే నవీన్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నిందితుడిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి సహాన ఘటనే నిదర్శమని పేర్కొన్నారు.
గుంటూరులో సహాన కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు బయల్దేరి వెళ్లారు. ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పు పెట్టడంతో ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
గుంటూరులో సహానా కుటుంబ సభ్యులకి @ysjagan గారు పరామర్శ
కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు, టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ నవీన్ పైశాచిక దాడితో తీవ్రంగా గాయపడి.. మృతి చెందిన తెనాలి యువతి సహానా
కుటుంబ సభ్యులతో ఘటన గురించి అడిగి తెలుసుకుని.. భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు
వైయస్ జగన్… pic.twitter.com/t9hRR4GJyC
— YSR Congress Party (@YSRCParty) October 23, 2024
బాధితులకు సీఎం పరామర్శ
జగన్ పర్యటన సమయంలోనే బద్వేలులో పెట్రోలు దాడికి గురై మరణించిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులతో బుధవారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశామని.. కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని చెప్పారు. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
అసలేం జరిగింది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే యువతి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 19వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో నవీన్ అనే వ్యక్తి ఆమెను కారులో ఎత్తుకెళ్లాడు. అనంతరం ఆమెపై దాడి చేయడంతో సహాన అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే తమ కుమార్తె ఆస్పత్రిలో ఉందని తెలియడంతో కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సహాన బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమెను రక్షించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. చివరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చివరకు మరణించింది.