Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్ దర్శించుకున్నారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సాయంత్రం ఆలయ శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న కరికల్ వలనెన్కు ఆలయ ఈవో పెద్దిరాజు పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు కరికల్ వలనెన్ ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఏపీ దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈఓలు మోహన్, హరిదాస్, అర్చక, వేద పండితులు పాల్గొన్నారు
శ్రీశైల మల్లన్నకు శాస్త్రోక్తంగా మాస శివరాత్రి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆదివారం చతుర్దశి సందర్బంగా ప్రదోషకాలంలో అర్చక వేదపండితులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన పూజలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. అనంతరం వృద్ద మల్లికార్జున స్వామి వారికి కూడా షోడశోపచార పూజాక్రతువులు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే శ్రీ భ్రమరాంబదేవి ఆలయంలో నిత్య కైంకర్యాలు యధావిధిగా జరిగినట్లు తెలిపారు.