Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదని తెలిపారు. లడ్డూ వివాదమనేది కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని చెప్పారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు బయల్దేరిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని తెలిపారు. కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారని అన్నారు. రామతీర్థంలో రాముడి తలను నరికారని చెప్పారు. ప్రభుత్వం అన్నింటిపైనా విచారణ జరిపిస్తుందని వెల్లడించారు.
ఇది కేవలం దీక్ష మాత్రమే కాదని.. శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష అని పవన్ కల్యాణ్ వివరించారు. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. దేవుడిపై రాజకీయాలు చేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా అనలేదని తెలిపారు. వారి ఉన్న సమాచారంతో మాత్రమే వాళ్లు అలా అన్నారని పేర్కొన్నారు. నెయ్యి వచ్చిన తేదీల విషయంలో కొద్దిగా అయోమయం ఉందని వారు చెప్పారని అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు.
#WATCH | Vijayawada: On Supreme Court’s observation during a hearing into Tirupati Laddu Prasadam issue, Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, “I think they said in such a way, they never said it was not adulterated. Whatever information they have on their hands, I think… pic.twitter.com/bRE9BaMaXz
— ANI (@ANI) October 1, 2024
మరోవైపు ప్రకాశ్‌రాజ్, పవన్ కల్యాణ్ మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తూనే ఉంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశంపై వీరిద్దరి మధ్య గొడవ నడస్తుండగా తాజాగా ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ !.. కదా?.. ఇక చాలు.. ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి’ అంటూ పవన్‌పై సెటర్లు వేశారు.