Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత వహించాలని అన్నారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ హైస్కూలులో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తమపై విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళలపై అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే ఆ పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి ముఖ్యమంత్రి మాట్లాడలేదని అన్నారు. అప్పులెలా వారసత్వంగా వచ్చాయో.. గత ప్రభుత్వాల తప్పిదాలు అలానే వచ్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన నేరాలు కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం అలసత్వం కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చిందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను బలంగా అమలు చేయాలని పదే పదే చెప్పా.. కానీ శాంతిభద్రతల పరిరక్షణ అనేది అధికారులకు అలవాటు తప్పిందని అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారని.. ఇవాళ ధర్మబద్ధంగా చేయండని ప్రాథేయపడుతున్నా మీనమేషాలు లెక్కపెడుతున్నారని తెలిపారు. పోలీసు అధికారులు దేనికి మీనమేషాలు లెక్కబెడుతున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
క్రిమినల్‌కు కులం, మతం ఉండదు
క్రిమినల్‌కు కులం, మతం ఉండవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయం పోలీసు అధికారులకు ఎన్ని సార్లు చెప్పాలని ప్రశ్నించారు. ఒకర్ని అరెస్టు చేయాలంటే కులం సమస్య వస్తుందట అని వ్యాఖ్యానించారు. మూడేళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు చదువుకుంది ఐపీఎస్ కాదా? ఇండియన్ పీనల్ కోడ్ మీకు ఏం చెబుతోంది. భారతీయ శిక్షాస్మృతి మీకు ఏం చెబుతోంది అని మండిపడ్డారు. క్రిమినల్స్‌ను వెనకేసుకురావాలని శిక్షాస్మృతి చెబుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెగేదాకా లాగకండి అని హితవు పలికారు.
హోంమంత్రిగా అనిత బాధ్యత వహించాలి
ఈ ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆవేదనను ఇలా డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైందని ఎస్పీలు, కలెక్టర్లకు కూడా చెబుతున్నానని.. ఉన్నతాధికారులు పదే పదే మాతో చెప్పించుకోవద్దని సూచించారు. తప్పులు చేసిన వారిని నా బంధువు.. నా రక్తమని ఎవరైనా చెబితే మడతపెట్టి కొట్టండని స్పష్టం చేశారు. నేను ఎవరినీ వెనుకేసుకు రావట్లేదని స్పష్టం చేశారు. హోంమంత్రి అనితకు కూడా చెబుతున్నా.. మంత్రిగా మీరు బాధ్యత వహించండని సూచించారు. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. మమ్మల్ని విమర్శించే నాయకులందరూ.. ఇలాగా ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండాలని సూచించారు. లేదంటే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది.. గుర్తుపెట్టుకోండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత మాత్రం ధైర్యం లేనప్పుడు పోలీసులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే ఉండటం దేనికి అని ప్రశ్నించారు. నాయకులు ఉన్నది ఓట్లు అడగడానికేనా? బాధ్యత నిర్వర్తించడానికి కాదా అని నిలదీశారు. నేను అడగలేక కాదు.. హోం శాఖ తీసుకోలేక కాదు అని అన్నారు. హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయని తెలిపారు.
డీజీపీ గారు.. మమ్మల్ని తిడుతున్నారు
ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు క్రిమినల్స్‌కు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. డీజీపీ గారు.. మేం బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని అన్నారు. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా పోలీసు శాఖ ఉండకూడదని చెప్పామని పేర్కొన్నారు. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అప్పుడున్న అధికారులే కదా ఇప్పుడు ఉన్నదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి