అమరావతి : కర్ణాటక రోడ్డు ప్రమాదంలో శ్రీ సత్యసాయి( Sri Satya Sai) జిల్లాకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. బెంగళూరు వెళ్తుండగా మధుగిరి వద్ద కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో తీవ్ర గాయాలపాలైన దంపతులు కృష్ణారెడ్డి ( Krishna Reddy ) , జ్యోతిక ( Jyothika ) అక్కడికక్కడే చనిపోయారు. మృతులు మడకశిర మండలానికి చెందిన దంపతులుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.