అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఊరికో సైకోను తయారు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి సైకోలను ప్రజలతో కలిసి తరిమికొట్టేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సైకోలను పూర్తిగా అణిచి వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీదని అన్నారు.విశాఖలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మూడేళ్లలో 8లక్షల కోట్లు అప్పులు చేశారని ఈ అప్పులు ఎవరు కడతారని అన్నారు.
భారతదేశంలో ఎవరూ వేయని విధంగా పన్నులు రాష్ట్ర ప్రజలపై విధిస్తున్నారని అన్నారు. పన్నుల పేరుతో బాదుతున్న జగన్‌రెడ్డి పాలన పోయేదాకా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. జగన్‌రెడ్డిది ఐరన్ లెగ్ అని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దివాలా తీసిందని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను తిడితే పదవులు ఇస్తున్నారని విమర్శించారు. పదవులు కావాలంటే ప్రజలతో ఉండాలని హితవు పలికారు. రాష్ట్రం కోసం రాబోయే 30 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉండాలని అన్నారు.