YS Jagan | ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటికీ ఇంకా ఆ వేడి తగ్గలేదు. కౌంటింగ్ దగ్గరికి వస్తుండటంతో టీడీపీ, వైసీపీ పార్టీలు తమ గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేసి ఇవాల్టికి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జగన్ ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫొటోను కూడా షేర్ చేశారు.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేండ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చిందని వైఎస్ జగన్ తెలిపారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేశామని చెప్పారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని పేర్కొన్నారు.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2024