అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురాలను మొదలు పెట్టారు. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేదపండితులు సీఎం జగన్ దంపతులకు ఆశీర్వాదం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
#WATCH | Andhra Pradesh Chief Minister YS Jagan participates in Makar Sankranti celebrations in Amaravati
(Source: I&PR Department) pic.twitter.com/RmodMzRHnP
— ANI (@ANI) January 14, 2024
అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’. అని ట్వీట్ చేశారు.
ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2024