అమరావతి : ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సహచర మంత్రులు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఏపీ మంత్రివర్గ విస్తరణలో మంత్రులు ఎవరైనా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని , జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
కేబినెట్ విస్తరణ ఎప్పుడనేది త్వరలో ఏపీ సీఎం జగన్ ప్రకటిస్తారని వెల్లడించారు. మంత్రివర్గంలో కొత్తవారిని తీసుకున్నా పాతవారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. పార్టీని తిరిగి గెలిపించుకున్న తర్వాత వారికి తప్పకుండా మంత్రి పదవులు వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారని వివరించారు. బడ్జెట్ విషయంలో మాట్లాడే ముందు ప్రతిపక్షం అన్నీ విషయాలు తెలుసుకోవాలని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో పనులు చేయకపోతే ప్రతిపక్షాలు ప్రశ్నించాలన్నారు.