AP CM Jagan | కొత్త వేరియంట్‌పై విలేజ్ క్లినిక్ వ్యవస్థను అప్రమత్తం చేయాలి : ఏపీ సీఎం జగన్
AP CM Jagan | కొవిడ్ కొత్త వేరియంట్‌పై విలేజ్ క్లినిక్ వ్యవస్థను అప్రమత్తం చేయాలని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan ) అధికారులను ఆదేశించారు.
అమరావతి : కొవిడ్ కొత్త వేరియంట్‌పై విలేజ్ క్లినిక్ వ్యవస్థను అప్రమత్తం చేయాలని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan ) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొవిడ్ (Covid) కొత్త వేరియంట్‌పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేరియంట్ వల్ల ఆందోళన అక్కర్లేదని వైద్యులు తెలిపారని, కొత్త వేరియంట్‌పై విలేజ్ క్లినిక్స్(Village clinics) సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కోలుకుంటున్నారని, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ముందస్తు చర్యలో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను(Oxgen Infra) సిద్ధం చేస్తున్నామని, పీఎస్ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు (Oxygen concentrators), డి టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామని, 56, 741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
డెల్టా వేరియంట్ తరహాల లక్షణాలు లేవని తెలిపారు. జేఎన్-1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందన్నారు. లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్ శాంపిళ్లను విజయవాడ జినోమ్ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని వివరించారు. కొత్త వేరియంటు గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదం చేస్తాయని, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ సిద్ధంగా ఉంచామని సీఎంకు వివరించారు. ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు, అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

