అమరావతి: ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవా లకు హాజరు కావాలని ఏపీ సీఎంకు టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిశారు. బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామి వారికి రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను సీఎంకు అందజేశారు. టీటీడీ చైర్మన్‌తో పాటు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.