అమరావతి : ఏపీ రాజధానిపై హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ ఏపీ సీఎం జగన్ మూడు ప్రాంతాల మధ్య విధ్వేషాలను రెచ్చగొడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఏపీ రాజధానిపై ఏపీ హైకోర్టు మొట్టికాయ వేయడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అక్కడ కూడా సర్కార్కు నిరాశ తప్పదని అన్నారు. అమరావతి రాజధాని కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు ఇవాళ ముస్లిములు నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో కేశినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఏపీని అభివృద్ధి చేయడంలో జగన్ విఫలం అవుతుందడడంతో జగన్ మూడు రాజధానులను ప్రస్తావిస్తూ ప్రజలను రెచ్చగొట్టుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలకు సమదూరం, నీటి వనరు, రవాణా వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారని నాని వెల్లడించారు. ఎన్నికల ముందు వరకు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.