అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఉద్యోగులను మోసం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడల్లా చర్చలకు ఆహ్వానించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్థిక పరిస్థితిని వివరించి తప్పించుకోవాలని చూస్తుందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
జగన్‌కు పాలనపై పట్టులేకపోవడంతోనే ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆర్థిక లోటు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం పిట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. పిట్ మెంట్‌ను 29 శాతం అడిగితే 43 శాతం, ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారని ఆయన వెల్లడించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు 20 శాతం పెంచారని తెలిపారు.