హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకొని మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈసారి ఆయన మరో అడుగు ముందుకేసి ‘తానే అందరికంటే పెద్ద జెన్‌జీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ సర్వే సెంటర్‌ను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఎప్పుడూ రెవల్యూషనరీగా ఆలోచిస్తానని, 40 ఏండ్ల తర్వాత ఏం జరుగుతుందో ఊహించగలనని స్పష్టంచేశారు.
తనకంటే ఇన్నోవేషన్లు తెచ్చేవారే లేరని గొప్పలు చెప్పుకున్నారు. గతంలో అనేకసార్లు ట్రోలింగ్‌కు గురైనా చంద్రబాబు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక తానే పెద్ద జెన్‌జీ అంటూ చంద్రబాబు పేర్కొనడంపై నెటిజన్లు సెటైర్లు, మీమ్స్ పేలుస్తున్నారు. ‘జెన్‌జీ అనే పదాన్ని కనిపెట్టింది.. కూడా మీరే బాబు’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన వారు కూడా మీ అంత డప్పు కొట్టుకోలేరు..’ అంటూ చురకలు అంటిస్తున్నారు.