Youtube Academy | ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాతో ఇవాళ సమావేశమైన చంద్రబాబు ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వారితో ఆన్లైన్లో సమావేశమైన చంద్రబాబు నాయుడు.. ఏపీలో పెట్టుబడుల గురించి చర్చించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు.
యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాతో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానిక భాగస్వాములతో కలిసి ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించామని తెలిపారు. యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు ద్వారా కంటెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా పరిశోధనలు చేయవచ్చని అన్నారు. అందుకే యూట్యూబ్ అకాడమీకి సంబంధించి అమరావతిలో భాగమైన మీడియా సిటీలో సాంకేతిక సహాయం అందించడానికి ఉన్న అవకాశాలను వారితో చర్చించామని చంద్రబాబు వెల్లడించారు.
Delighted to connect with @YouTube Global CEO, Mr @nealmohan, and @Google APAC Head, Mr Sanjay Gupta online today. We discussed setting up a YouTube Academy in Andhra Pradesh, in collaboration with local partners, to foster AI, content development, skill development and…
— N Chandrababu Naidu (@ncbn) August 6, 2024