అమరావత : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూర్పాలెంలో మహిళ(Women) పై అత్యాచారం, హత్య ఘటన(Rape and murder ) పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( Chandra Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని, బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి వంగలపుడి అనిత(Home Minister) ను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉండాలని సూచించారు. ఘటనపై వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలని అన్నారు.