అమరావతి : ఏపీ కేబినెట్ (AP Cabinet) కీలక అంశాలపై ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతి ( Amaravati) పరిధిలోని ఏడు గ్రామాల పరిధిలో మరో 16,666.57 ఎకరాలు భూసమీకరణకు( land acquisition) సీఆర్డీఏకు అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణం పొందే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్రమంత్రి కొలుసు పార్ధసారథి వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు , రాష్ట్రంలో దూదేకుల, నూర్‌బాషా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ల ఏర్పాటు, పట్టణ స్థానిక సంస్థల్లో రెగ్యులేషన్, కంట్రోల్ ఆఫ్ డిస్ప్లే డివైజస్‌కు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీలో ఒప్పంద పద్ధతి ద్వారా 16 పోస్టుల భర్తీకి , పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలకు, పోలవరం ప్రాజెక్టు పరిధిలోని రూ. 542.85 కోట్ల పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.