అమరావతి : ఏపీలో కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వం ఈనెల 24న కేబినెట్ (Cabinet ) సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తో పాటు మంత్రులంతా హాజరుకానున్నారు.
ఈ నెల 21, 22 వతేదీల్లో అసెంబ్లీ సమావేశాల (Assembly) ను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మొదటి రోజు ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణం, అనంతరం అసెంబ్లీకి ఎన్నికైన 175 మంది శాసన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
మరుసటి రోజు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలనంతరం 24న ఉదయం 10 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సందర్భంగా కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 21 సాయంత్రం లోగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.