అమరావతి : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ రెండున్నర ఏండ్ల అధికారంలో రెట్టింపు అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని , ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 25,800 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసిందని అన్నారు. ఈ ఏడాదిలోనే రెవెన్యూలోటు పూడ్చడంలో భాగంగా రూ.11,600 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను ఏపీకి కేంద్రం ఇచ్చిందని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటుకు డీపీఆర్లు ఇవ్వాలని కోరినా… ఇప్పటి వరకూ వైసీపీ నుంచి స్పందన లేదని ఆరోపించారు. అమరావతి రాజధానిగా ఉంటుందని కేంద్రం కూడా అంగీకరించిందని ఆయన స్పష్టం చేశారు.