పలువురు సభ్యులు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ జీతం తీసుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో అయ్యన్నపాత్రుడు పాల్గొని ప్రసంగించారు.
ప్రజలు మనల్నిఎ మ్మెల్యేలుగా ఎన్నుకున్నది ప్రజా స మస్యలు పరిష్కరించడానికి అని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నామ ని పేర్కొన్నారు. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే విధానం అనుసరిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఏడాదిలో అసెంబ్లీ స మావేశాలు జరిగేదే రోజులు అని తెలిపారు. వాటికి కూడా రాకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.