అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly ) ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను (Annual Budget) ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో సమావేశాల తొలిరోజే సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ సమర్పణ తరువాత, అసెంబ్లీ సమావేశాలు కనీసం పది రోజుల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనతో పాటు వివిధ బిల్లులను ప్రవేశపెట్టి సమావేశం ఆమోదం పొందనుంది.
కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత, ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో జూలైలో ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, నవంబర్ వరకు నాలుగు నెలల పాటు గవర్నర్ తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం తీసుకున్నారు.
సమావేశాల ప్రారంభం కంటే గంట ముందు మంత్రి మండలి ప్రత్యేక సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన నిర్వహించనుంది. మంత్రి వర్గ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తరువాత అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాష్ట్రగవర్నర్‌ను కలిసి బడ్జెట్‌కు సంబంధించిన ఏజెండా అంశాలను వివరించారు.