అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు(AP assembly) ఈనెల 11 నుంచి పది రోజులపాటు జరుగనున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ (Annual budget ) ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్ 30తో ముగియనుంది.
ఈ సందర్భంగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వీటితో పాటు ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనుంది. గత జులై నెలలో జరిగిన చివరి సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగేందుకు అవకాశముంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన వరదల్లో బాధితులకు సహాయంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ ప్రభుత్వం కూటమి సర్కార్ను నిలదీసే సూచనలున్నాయి.