అమరావతి : పల్నాడు (Palnadu District,) జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నెల్లూరు నుంచి కాకినాడకు వెళ్తుండగా కారు పంక్చర్ అయ్యింది. టైరు మారుస్తుండగా గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీ కొంది.
ఈ ప్రమాదంలో నిడమర్రుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.