ఏపీలో పురుడు పోసుకోనున్న మరో రాజకీయ పార్టీ..
political party|ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు నిర్వాహకులు సన్నహాలు చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు నిర్వాహకులు సన్నహాలు చేస్తున్నారు.
తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు రాజకీయ పార్టీ అవసరమని భావిస్తున్న నాయకులు ముందస్తుగా విజయవాడలో సమావేశమై చర్చించారు. ఏప్రిల్ 14న కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని వెల్లడించిన నాయకులు అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి శ్రావణ్కుమార్ నేతృత్వంలో అంబ్కేర్ జయంతి రోజున పూర్తి సమాచారంతో పార్టీని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై పోరును సలిపేందుకు పార్టీ ఉద్దేశమని వీటిని అరికట్టేందుకు ఒక వేదిక ఉండాలనే లక్ష్యంతో పార్టీని నెలకొల్పుతున్నామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
2024లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దళిత, బహుజనుల చేత పోటీ చేయిస్తామని నిన్న విజయవాడలో జరిగిన దళిత అసెంబ్లీ సమావేశంలో శ్రావణ్కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులతో పాటు మాల మహానాడు, మాల మహాసభ, ఎమ్మార్పీఎస్, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పాల్గొనడం విశేషం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

