అమరావతి : ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్(Ultra Cement) పరిశ్రమలో బాయిలర్ పేలిన (Boiler explosion ) ఘటనలో తీవ్రంగా గాయపడ్డవారిలో మరొకరు శుక్రవారం మృతి చెందారు. ఈనెల 7న జరిగిన ఘటనలో మొత్తం 20 మంది కార్మికులు (Labours) గాయపడగా వీరిలో 5 గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరిలో చికిత్స పొందుతూ ఇప్పటికే ఇద్దరు కార్మికులు చనిపోగా మణిపూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అర్జున్(Arjun) అనే కార్మికుడు ఈరోజు మృతి చెందారు.
దీంతో ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం క్షతగాత్రులకు యాజమాన్యం తగిన నష్టపరిహారం అందించాలని ఆదేశించింది . గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని స్పష్టం చేసింది .
Read more :
YS Jagan | వైసీపీకి షాక్.. మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసు నమోదు
Pawan Kalyan | ఒక్క రోజులో మార్పు తీసుకురాలేం.. కొంత సమయం కావాలి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్