అమరావతి : ఇప్పటికే భారీ వర్షాలతో (Heavy rains) అతలకుతలమైన విజయవాడ పట్టణం మరో అల్పపీడనం(Low Pressure) వణికిస్తోంది. నాలుగురోజులుగా నీటిలోనే ఉన్న అనేక కాలనీవాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణశాఖ హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
రుతుపవనాలు చురుకుగా ఉండడం వల్ల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని కారణంగా నాలుగురోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి అనకాపల్లి, విశాఖ , కాకినాడ, కోనసీమ, గోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది.