అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సంసిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న ఒప్పందాలు, సీఎం పదవి కాలపరిమితి పంపకాలు తదితర అంశాలపై సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య (Hari Rama Jogaiah) కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan) కు మూడు కీలక అంశాలపై సూచనలు చేస్తూ శనివారం లేఖ రాశారు.
నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలలో ఏదో ఒకచోట పవన్ పోటీ చేయాలని సూచించారు. అదేవిధంగా రెండున్నరేళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని తెలిపారు. టీడీపీ, జనసేన మధ్య పవర్షేరింగ్ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సీఎం ప్రతిపాదన అంశం ప్రజల్లోకి వెళ్తే టీడీపీ, జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని వెల్లడించారు.