తిరుమల : బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూధన్ టీటీడీ(TTD Annaprasadam) అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటిని విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు భరత్ కుమార్, నవీన్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 75,140 మంది భక్తులు దర్శించుకోగా, 28,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చిందని తెలిపారు.