అమరావతి: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను వెల్లడించనున్నారు. ఏపీలో మొత్తం 10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వారిలో 4,84,197 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా, 5,19,793 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి.