AP DSC : ఏపీలో మెగా డీఎస్సీ (Mega DSC – 2025) నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆ శాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.
ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు : ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ
మే 20 నుంచి : నమూనా పరీక్షలు
మే 30 నుంచి : హాల్‌టికెట్ల డౌన్లోడ్
జూన్ 6 నుంచి జూలై 6 వరకు : పరీక్షలు
పరీక్షలు పూర్తయిన తర్వాత రెండో రోజు ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటిస్తారు.