ఏపీలో కొత్తగా 12,634 కరోనా కేసులు, 69 మరణాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 69 మంది మృత్యువాతపడ్డారు. 4,304 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 89,732గా ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,680 కరోనా కేసులు నమోదవ్వగా చిత్తూరులో 1,628, గుంటూరు-1,576, నెల్లూరు-1,258, కర్నూలు-1,158, అనంతపురం-1,095, విశాఖపట్నం-1,051, తూర్పుగోదావరి-952, విజయనగరం-692, కృష్ణా-641, ప్రకాశం-353, పశ్చిమ గోదావరి-331, కడపలో 219 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కొవిడ్-19 మరణాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణాలో 12, నెల్లూరులో 7, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడపలో ఐదుగురు చొప్పున, చిత్తూరు, గుంటూరులో నలుగురు చొప్పున, ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

