Lance Naik B Sai Teja: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా
Lance Naik B Sai Teja: జనరల్ బిపిన్ రావత్‌తోపాటు ప్రాణాలు కోల్పోయిన యువ సైనికుడు, లాన్స్ నాయక్ బీ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

అమరావతి: ఈ నెల 8న జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌తోపాటు ప్రాణాలు కోల్పోయిన యువ సైనికుడు, లాన్స్ నాయక్ బీ సాయితేజ ( Lance Naik B Sai Teja ) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాయితేజ సీడీఎస్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ నెల 8న జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్, సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆర్మీ హెలిక్యాప్టర్‌లో తమిళనాడులోని సూలూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హెలిక్యాప్టర్ చెట్టును ఢీకొట్టి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో హెలిక్యాప్టర్లోని 14 మందికిగాను బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు తీవ్రంగా కాలినగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

