Kesineni Chinni | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏసీఐ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శిగా ఎంపీ సానా సతీశ్, జాయింట్ సెక్రటరీగా విజయ్‌కుమార్, ట్రెజరర్‌గా దండమూరి శ్రీనివాస్ సహా 34 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. మూడేళ్ల పాటు ఈ కమిటీ సేవలందించనుంది.
ఈ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కాగా, ఉపాధ్యక్ష అభ్యర్థి నరసింహారావు నామినేషన్‌ను తిరస్కరించారు. సకాలంలో నామినేషన్ వేయకపోవడంతో తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ ఉపాధ్యక్ష పదవికి సెప్టెంబర్ 16వ తేదీన మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. మూడేళ్లలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించి.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది క్రీడాకారులను తయారుచేస్తామని.. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహిస్తామని వెల్లడించారు. అసోసియేషన్ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తామని అన్నారు.