Junior NTR | జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నేత గుత్తా ధనుంజయ నాయుడకు కాల్ చేసి నోరుపారేసుకున్నారు. అసలు ఎన్టీఆర్ సినిమాలు ఎవరైనా చూస్తారా అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. దానికి సంబంధించిన ఆడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది.
‘ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారు? నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను. పర్మిషన్ లేకుండా ప్రత్యేక షోలు ఎలా వేస్తారు. వాడి సినిమాకు ఎలా వెళ్తారు.. కూలీకి పోండి.. పార్టీకి కలిసిరాని వ్యక్తి సినిమాకు ఎలా వెళ్తారు. ఆ సినిమా వేస్తే కాల్చేస్తాను.. ఆ సినిమా రీల్ కూడా రాదు. నా అనుమతి లేకుండా సినిమా ఎలా ప్రదర్శిస్తారు. వాడితో డ్యాన్సులు చేస్తారా? మీరు సినిమా చూడండి మీకు అప్పుడు చెబుతాను. సినిమాను ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్చేస్తా. వాడి సినిమా ఈ టైమ్‌లో ఎలా వేస్తారు. ఆడించుకోండి చూద్దాం.’ అని దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడారు.
తాజాగా ఈ ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నాని మండిపడ్డారు. తాను మొదట్నుంచి నందమూరి కుటుంబానికికి అభిమానిని అని.. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు ఇష్టంగా చూసేవాడినని తెలిపారు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను తాను తిడుతున్నట్లుగా ఆడియో సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆడియోపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ ఆడియో కాల్స్ వల్ల ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకుని ఉంటే.. క్షమించండని విజ్ఞప్తి చేశారు. నా ప్రమేయం లేకపోయినప్పటికీ.. నా పేరును ప్రస్తావించారు కాబట్టే ఈ క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ pic.twitter.com/D5Y6xstJ7j
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025