AR Constable Prakash | వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఆఫీసు నుంచి ఆర్డర్స్ అందుకున్న ఆయన.. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కలిసి తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ హయాంలో పోలీస్ సిబ్బందికి రావాల్సిన బకాయిలను డిమాండ్ చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ధర్నా చేశారు. దీంతో అతన్ని క్రమశిక్షణారాహిత్యం కింద పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకాశ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.